కరంట్ అఫైర్స్ – జూలై 15, 2020

భారత్ కు ఇజ్రాయిల్ క్షిపణులు

భారత్ తన సరిహద్దు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందకుఇజ్రాయిల్ నుంచి ఎమర్జీ ఫైనాన్షియల్ పవర్స్ కింద.. 12 స్పైక్ లాంచర్స్, 200 మిస్సైల్స్ ను కొనుగోలు చేయనుంది. గతేడాది బాలాకోట్ ఏరియల్ స్ర్టైక్ సమయంలో కూడా భారత్ ఇంతే మొత్తంలో స్పైక్ లాంచర్స్, మిస్సైల్స్ ను ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసింది. పాకిస్తాన్ వైపు ఉన్న సరిహద్దులో వాటిని మోహరించింది. ఇప్పుడు కొనుగోలు చేయనున్న మిసైల్లను చైనాతో ఉన్న సరిహద్దు వెంట మోహరించనున్నారు.  

జూమ్, జియో మీట్ కు పోటీగా ఎయిర్ టెల్ బ్లూజీన్స్

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇళ్ల నుంచి బయటికొచ్చే పరిస్థితులు లేకపోవడంతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జూమ్, జియో మీట్ లాంటి వీడియో కాలింగ్ యాప్ లకు పోటీగా ఎయిర్ టెల్ బ్లూజీన్స్ పేరుతో ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫామ్ ప్రారంభిస్తున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగ CEO గోపాల్ విఠల్ ప్రకటించారు. వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతను కాపాడడంలో ఎయిర్ టెల్ బ్లూజీన్స్ అత్యంత సురక్షితమైన ప్లాట్ ఫామ్ అనీ, ఇది ఒకేసారి 150 నుంచి 50 వేల మందిని సపోర్ట్ చేస్తుందని గోపాల్ విఠల్ వివరించారు.

20 ఏళ్ల తర్వాత అమెరికాలో మరణశిక్ష అమలు

ఓక్లహామాలోని యుకాన్ ప్రాంతానికి చెందిన డానియల్ లీ(47) అనే వ్యక్తి తుపాకుల వ్యాపారి అయిన విలియం ముల్లర్, అతని భార్య, కుమారుడిని చంపిన కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. అధికారులు ఈ మరణశిక్షను లీకి జూలై– 14న విషపు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అమలు పరిచారు. 2003 తర్వాత అమెరికాలో మరణశిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.

టాటాచంద్రశేఖరన్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లాక్ హీడ్ మార్టిన్ CEO జిమ్ టైక్లెట్ ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక USIBC గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు అందుకోనున్నారు. “ అద్భుతమైన నాయకత్వం, భారత్ అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఏటా USIBC ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది .”

N. చంద్రశేఖరన్, జిమ్ టైక్లెట్ లు US ఇండియా CEO ఫోరమ్ కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ, గూగుల్ సుందర్ పిచాయ్, అమెజాన్ జెఫ్ బెజోస్ లు ఈ అవార్డులను అందుకున్నారు.

USIBC – U.S. – India Business Council 1975లో ఏర్పడింది.

దీని ప్రస్తుత ఛైర్మన్ నిశా దేశాయ్ బిస్వాల్.

దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ (D.C.) లో ఉంది.

రైల్వే లైన్ నిర్మాణం నుంచి భారత్ ను తప్పించిన ఇరాన్

చాబహర్ పోర్ట్ నుంచి జహెదాన్ వరకు రైల్వే లైన్ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టాలని ఇరాన్ నిర్ణయించింది. భారత్ నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని పేర్కొన్న ఇరాన్ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణం నుంచి తప్పించనున్నట్లు తెలిపింది. ఈ రైల్వే లైన్ ను 2022, మార్చి నెల నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే దీని కోసం ఇరానియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి 400 మిలియన్ డాలర్లు తీసుకోనున్నారు.

ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాసియా దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటులో భాగంగా ఇరాన్ లో చాబహర్ పోర్ట్ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు అందజేస్తామని, నిర్మాణ పనుల్లో సహకరిస్తామని ఇండియా హామీ ఇచ్చింది. ఇండియా ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నాలుగేళ్ల క్రితం ఇండియాఇరాన్ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఇరాన్ పక్కన పెట్టింది. అయితే, ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

పౌష్టిక భారతం..

ఆసియా దేశాల్లో భారత్, చైనా టాప్: ఐరాస

భారతదేశంలో పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 60 మిలియన్ (6 కోట్లు) లకు తగ్గింది. 2004- 06 లో 21.7 % మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా, అది 2017- 19 నాటికి 14%నికి తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య తగ్గిందని, కానీ అదే సమయంలో ఊబకాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య మరింత పెరిగిందని తెలిపింది. ఆకలి, పౌష్టికాహార లోపాన్ని అంతం చేసే దిశగా గ్లోబల్ స్టడీ ట్రాకింగ్ కృషి చేస్తోంది. పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంలో తూర్పు, దక్షిణాసియా దేశాల్లో భారత్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.

తగ్గిన స్టంట్స్ చిన్నారి బాధితులు

భారతదేశంలో స్టంట్స్ తో ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లల సంఖ్య భారీగా తగ్గిందని అది కూడా 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని ఐరాస తెలిపింది. 2012లో 47.8% మంది బాధితులుండగా, 2019 నాటికి 34.7% నికి తగ్గిందని తెలిపింది. ఊబకాయం విషయానికొస్తే, 2012 లో 2.05 కోట్ల మంది బాధితులుండగా, 2016 నాటికి 3.04 లక్షలకు పెరిగారు.

ఫ్లిప్ కార్ట్ లో వాల్ మార్ట్ భారీ పెట్టుబడి

ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ గా ఉన్న వాల్ మార్ట్ కంపెనీకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఇండియాలో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా తన వాటాను పెంచుకుంది. తాజా పెట్టుబడితో ఫ్లిప్ కార్ట్ లో వాల్ మార్ట్ పెట్టుబడి 24.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2018లో ఒకేసారి పెద్దమొత్తంలో 16 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఇండియా ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ లో జెఫ్ బేజోష్ సారధ్యంలోని అమెజాన్, ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఈకామర్స్ విభాగం జియోమార్ట్ తో పోటీ ఎదుర్కొంటున్న ఫ్లిప్ కార్ట్ కు తాజా పెట్టుబడి ఎంతగానో ఉపయోగపడుతుందనీ ఫ్లిప్ కార్ట్ ఇండియా CEO కళ్యాణ్ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

BCCI తాత్కాలిక CEOగా హేమాంగ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తాత్కాలిక CEOగా హేమాంగ్ అమిన్ నియమితులయ్యారు. రాహుల్ జోహ్రీ ఈ పదవికి రాజీనామా చేయడంతో జోహ్రీ స్థానంలో హేమాంగ్ ను బోర్డ్ నియమించింది. అయితే 2016లో బాధ్యతలు చేపట్టిన జోహ్రీ పదవీకాలం 2021 వరకు ఉంది. 2019 IPL సీజన్ ప్రారంభోత్సవ ఖర్చుని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు BCCI విరాళం ఇవ్వడంలో హేమాంగ్ కీలకపాత్ర పోషించాడు.

హోల్డర్ @ 2

టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్

వెస్ట్ండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అంతర్జాతీయ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో 7 వికెట్లు తీశాడు. దీంతో 862 రేటింగ్ పాయింట్లతో కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. గత 20 ఏళ్లలో ఏ విండీస్ బౌలర్ కూడా ఇన్ని పాయింట్స్ సాధించకపోవడం విశేషం. 2000లో వాల్ష్ అత్యధికంగా 866పాయింట్స్ పొందాడు. ప్యాట్ కమిన్స్ (ఆసీస్) తొలి స్థానంలో, బుమ్రా ఏడో ర్యాంకులో ఉన్నాడు.

బ్యాటింగ్ విభాగంలో స్టీవ్ స్మిత్, కోహ్లీ టాప్ 2 ఆటగాళ్లుగా కొనసాగుతుండగా పుజారా 7, రహానే 9 వ స్థానాల్లో ఉన్నారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments