కోవిడ్ – 19 || అన్ లాక్ – 3 లో ఇవి ఓపెన్ ?

కోవిడ్ – 19 అన్ లాక్ – 2 జూలై 31తో ముగుస్తోంది. దీంతో.. అన్ లాక్ – 3 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి మరికొన్ని అంశాల్లో నిబంధనలను సడలించేందుకు విధి విధానాలు సిద్ధం చేస్తోంది. మొదటి రెండు దఫాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం… ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లు, జిమ్ములు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వనుందట. పాఠశాలలు, కాలేజీలు, మెట్రీ సర్వీసులు మాత్రం యథావిధిగా మూసివేసి ఉంటాయట. ఇప్పట్లో పాఠశాలలు తెరవాలా వద్దా అనే అంశాన్ని రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. అన్ లాక్ – 3 లో థియేటర్లు, జిమ్ముల నిర్వహణకు అనుమతి ఇస్తూనే భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిర్వాహకులు చర్యలు…

Read More

తల్లిదండ్రులకు కరోనా – 6 నెలల బాబుకి అమ్మైన డాక్టర్ !!

“కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మేకదా..” పైన ఫోటోని వర్ణించేందుకు ఈ పాటకన్నా అద్భుతమైనది మరొకటి దొరకదు. కరోనా తెచ్చిన భయం.. మనుషుల మధ్య అనుబంధాలని, మానవత్వాన్ని మంటకలుపుతోంది. ఇలాంటి సమయంలో… కేరళలోని ఓ డాక్టర్… కరోనా సోకిన దంపతులు ఆసుపత్రిలో చేరితో… వారి బిడ్డని అక్కున చేర్చుకొని.. నెల రోజులు కన్నబిడ్డలా ఆలించింది. లాలించింది. పాలించింది. ఆ దంపతులు కరోనా నుంచి కోలుకొని బిడ్డని తీసుకెళ్లేందుకు వస్తే.. బుడ్డోడిని వారికి అప్పగిస్తూ కన్నీటిపర్యంతమైంది. నెల రోజుల పాటు తన ఒడిలో ఆడుకున్న బాబు.. దూరం అవడంతో తల్లడిల్లింది. అందుకే.. అంటారు అమ్మ ప్రేమని మించింది లేదని. కన్న ప్రేమ అయినా.. పెంచిన ప్రేమ అయినా.. రెండూ గొప్పవే అని ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది.…

Read More