శ్రీవారి సన్నిధిలో 15 మంది అర్చకులకు కరోనా !

తిరుమల తిరుపతి దేవస్థానంలోని 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మరో 25 మంది అర్చకుల ఫలితాలు రావాల్సింది ఉంది. దీంతో తితిదేలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన అర్చకులు, సిబ్బంది సంఖ్య 140కి చేరింది. అయితే.. కరోనా వైరస్ కేసులు ఎక్కువ అవుతున్నా.. ఇప్పట్లో దర్శనాలు నిలిపే పరిస్థితి లేదని టీటీడీ ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనాలు నిలిపివేయాలని కోరినా… టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఒప్పుకోవడం లేదంటూ.. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్వీట్ చేసిన కొన్ని గంటలకే… వైవీ సుబ్బారెడ్డి దర్శనాలపై స్పష్టత ఇచ్చారు. రమణ దీక్షితులు చెప్పాల్సింది ఏదైనా ఉంటే టీటీడీ బోర్డుకి చెప్పాలీ కానీ ఇలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రమణ దీక్షితులు కొన్ని రోజులుగా టీటీడీ ఈవో, ఏఈవోపై ట్వీటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా 20 మంది అర్చకులని బాధ్యతల నుంచి విరమణ చేయించిందని… ముఖ్యమంత్రి జగన్ వారందరినీ తిరిగి శ్రీవారి సేవలోకి తీసుకునేందుకు అంగీకరించారని… అయినా టీటీడీ ఈవో, ఏఈవో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు టీటీడీకి ఆదేశాలు ఇచ్చినా.. వాటిని కూడా పాటించడం లేదని ట్వీట్లలో పేర్కొన్నారు. రమణ దీక్షితులు చేస్తున్న ఈ ట్వీట్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో !!

 

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments