కరోనా – హైదరాబాద్ లో హై రిస్క్ ఏరియాలివే !!

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు వారి వారి పనుల మీద రోడ్లపైకి రావడం, మార్కెట్లన్నీ తెరుచుకోవడం వల్ల.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 76 శాతానికిపైగా కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 34,671 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 26,574 మంది గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు. ఇటీవల టెస్టుల సంఖ్య పెంచడంతో.. అధిక కేసులు బయటపడుతున్నాయి. పరిస్థితి తీవ్రమవుతుండడంతో జీహెచ్ఎంసీ మళ్లీ కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. 500కుపైగా కేసులున్న 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. ఆ ఏరియాల్లో కంటెయిన్మెంట జోన్లను ఏర్పాటు చేసి.. స్పెషల్ ఆఫీసర్లను నియమించింది బల్దియా. 500పైగా కేసులున్న…

Read More