కోవిడ్ – 19 || అన్ లాక్ – 3 లో ఇవి ఓపెన్ ?

కోవిడ్ – 19 అన్ లాక్ – 2 జూలై 31తో ముగుస్తోంది. దీంతో.. అన్ లాక్ – 3 ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1 నుంచి మరికొన్ని అంశాల్లో నిబంధనలను సడలించేందుకు విధి విధానాలు సిద్ధం చేస్తోంది. మొదటి రెండు దఫాల్లో ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వంఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లు, జిమ్ములు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వనుందట. పాఠశాలలు, కాలేజీలు, మెట్రీ సర్వీసులు మాత్రం యథావిధిగా మూసివేసి ఉంటాయట. ఇప్పట్లో పాఠశాలలు తెరవాలా వద్దా అనే అంశాన్ని రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

అన్ లాక్ – 3 లో థియేటర్లు, జిమ్ముల నిర్వహణకు అనుమతి ఇస్తూనే భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించనుందని సమాచారం. సీటింగ్ కెపాసిటీలో 50 శాతం వీక్షకులతో థియేటర్లు నడిపిస్తామని నిర్వాహకులు తెలపగాకేంద్రం మాత్రం మొదట్లో కేవలం 25 శాతం వీక్షకులనే అనుమతించాలనితర్వాతి రోజుల్లో పరిస్థితిని బట్టి 50 శాతానికి పెంచుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతోథియేటర్లు తెరిచేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారట. దేశంలో మార్చిలో లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి సినిమా హాళ్లు మూసి ఉన్నాయి.

ఇకజూలై 25 నాటికి దేశంలో 13 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. 8 లక్షల 50 వేల మందికిపైగా కోలుకున్నారు. 31, 358 మంది మరణించారు. నాలుగున్నర లక్షల పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments