సాక్షిలో సత్తి.. కంటెంట్ సవాళ్లను అధిగమిస్తాడా ?

sathi

పత్రికా భాష..! ఎలక్ట్రానిక్ మీడియా పదకోశం.. ! తెలుగు మీడియాను చాలా కాలంగా ఫాలో అవుతున్న వారికి ఈ రెండు సుపరిచితమే. మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే మాటలకి, దోస్తులతో పెట్టే బాత్కానీకి, బంధువులతో ముచ్చట్లకితెలుగు మీడియాలో వాడే భాషకి ఎంతో వ్యత్యాసం. అందుకేనేమో.. కేవలం చదువుకున్న వారికే పత్రికలు.. రోజు జరిగే పరిణామాలపై అమితా ఆసక్తి ఉండే వారికే ఎలక్ట్రానిక్ మీడియా చేరువయ్యాయి. దీంతోగ్రామీణ ప్రాంతాలకిన్యూస్ కి కొంచెం గ్యాప్ ఉండేది. దాన్ని ఫిల్ చేస్తూ.. వీ6 ఛానల్ డిజైన్ చేసిన తిన్మార్ న్యూస్.. కొద్ది రోజుల్లోనే అందరినీ అట్రాక్ట్ చేసింది. తెలంగాణ భాష, యాసలో వార్తలుప్రభుత్వాలు, అధికారుల వైఫల్యంపై విమర్శల్ని వ్యంగంగా ప్రెజెంట్ చేస్తూ.. రాత్రి 9.30 గంటల స్లాట్ లో పాగా వేసింది. ఈ సమయంలో ఎంటర్టైన్మెంట్ చానల్స్ తో దీటుగా టీఆర్పీ సాధించి.. సత్తా చాటింది తిన్మార్ బులెటిన్. మల్లన్న(నవీన్), రాములమ్మ (రమ్యకృష్ణ), బిత్తిరి సత్తి (చేవెల్ల రవి), సావిత్రి (శివ జ్యోతి) వంటి వారు ఈ బులెటిన్ ద్వారానే పాపులర్ అయ్యారు.

ఎవరు కాదన్నా.. ఔనన్నా.. బిత్తిరి సత్తికి ఈ రోజు ఈ స్థాయిలో ప్రజల ఆదరణ లభిస్తుంది అంటే .. దానికి ప్రధాన వేదిక వీ6 ఛానల్. మనలో ఎంత సత్తా ఉన్నా.. దాన్ని నిరూపించుకునేందుకు.. పది మందికి మనమేంటో చూపేందుకు ఓ వేదిక కావాలి. సత్తికి అలాంటి వేదికని వీ6 కల్పించింది. ఛానల్ పాలసీ ఎలా ఉన్నా.. సత్తి చేసే సెటైరికల్ న్యూస్ వీక్షకులకి నచ్చేది. కారణం ఏదైనాఅలాంటి ఛానల్ ని విడిచి.. సత్తి టీవీ9కి వెళ్లాడు. ఇస్మార్ట్ సత్తి అంటూ అలరించాడు. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి కూడా సత్తి బాటలోనే టీవీ9 లో చేరారు. కానీ వీ6 లో ఉన్నప్పడి ఫాలోయింగ్ .. టీవీ9 కి వెళ్లాక తగ్గింది. ఇకటీవ9 లోను సత్తి అంత స్వేచ్ఛగా పనిచేయలేకపోయారన్నది మీడియా సర్కిల్స్ లో టాక్. స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్ లో వీ6లో లభించినంత ఫ్రీడమ్టీవీ9 టీమ్ సత్తికి ఇవ్వలేదట. నిర్బంధాల మధ్య చేసే ఏ పనైనా మంచి అవుట్ పుట్ ఇవ్వదు కదా. ఈ క్రమంలోనే ఫాదర్స్ డే రోజు చేసిన ప్రోగ్రామ్ లో తన తండ్రి గురించి గొప్పగా చెబుతూ ఆయన ఫోటో వాడారు. ఇది టీవీ9 యాజమాన్యానికి కోపం తెప్పించిందట. దీంతోటీవీ 9 నుంచి కూడా బయటకు వచ్చేసిన సత్తి.. సాక్షిలో చేరాడు. ఇది తండ్రిని గౌరవించుకునే అడ్డా అని.. ఇక నీకు అడ్డు లేదు బిడ్డా అంటూ తన తండ్రి దీవిస్తున్నట్లు ప్రోమో రెడీ చేసి వదిలాడు సత్తి. తనదైన స్టైల్ లో టీవీ9కి కౌంటర్ ఇచ్చాడు. పనిలో పనిగా.. రాములమ్మ, సావిత్ర మార్క్ స్టైల్ ని సాక్షిలోను అమలు చేసేందుకుతెలంగాణ యాస, భాషలో హుషారుగా మాట్లాడే లేడీ యాంకర్ కావాలంటూ ఓ ప్రకటన కూడా వదిలారు. అన్నీ ఓకే అయితేఇక సాక్షిలో బిత్తిరి సత్తి హడావుడి ఎలా ఉంటుందో చూడటమే తరువాయి.

అయితే.. సత్తి గతంలో చేసిన ఛానల్స్.. ఆయా సమయాల్లో న్యూస్ విషయంలో ప్రత్యేక పాలసీని అమలు చేశాయి. వీ6 కొన్నాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా, వివేక్ పార్టీ మారగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైడ్ తీసుకున్నాయి. ఇక టీవీ9 .. యాజమాన్యం చేతులు మారిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్టర్ గా మారిందన్న ప్రచారం మీడియాలో జరుగుతోంది. సత్తి ఇప్పుడు ఉన్నది సాక్షిలో కాబట్టి.. మనం మాట్లాడుకోవాల్సింది దీని గురించే. సాక్షి ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షానికి అండగా ఉంటుంది. జగన్.. కేసీఆర్ మధ్య సత్సంబంధం ఉంది కాబట్టి.. తెలంగాణలోను ప్రభుత్వ వైఫల్యాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వార్తలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నది. వ్యతిరేక వార్తల్ని సైడ్ చేస్తున్నది. తెలుగు మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఈ విషయం తెలిసిందే. సెటైరికల్ న్యూస్ కి పెట్టింది పేరుగా గుర్తింపు పొందిన సత్తిఇప్పుడు సాక్షిలో ఎలాంటి పాలసీ అమలు చేస్తాడన్నదే అసలు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై వ్యంగంగా స్పందించలేడు.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్స్ ని ప్రజెంట్ చేయలేడు. కేంద్రం జోలికి అసలే పోలేడు ( అది చేస్తే అసలుకే మోసం ). అంటే.. రాజకీయలు, ప్రభుత్వాల పాలన ప్రస్తావన లేకుండా…. కేవలం సైడ్ టాపిక్స్ కే సత్తి కంటెంట్ పరిమితం అవనుందా… ?

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments