ముంబైకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బీ.కే. మిశ్రా.. ప్రతిష్టాత్మక డాక్టర్ బీ.సీ. రాయ్ జాతీయ అవార్డు – 2018 ఎంపికయ్యారు. ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ మిశ్రా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటారు.
· బీసీ రాయ్ అవార్డు.. భారత వైద్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారం.
· బీసీ రాయ్ అవార్డుని 1976లో భారతీయ మెడికల్ కౌన్సిల్ నెలకొల్పింది.
· ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు.
· ఆరు రంగాల్లో ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
మాదిరి ప్రశ్న
ఎమినెంట్ మెడికల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ – 2018 గా ప్రతిష్టాత్మక బీసీ రాయ్ అవార్డుకి ఎంపికైన ప్రముఖ వైద్యుడు ఎవరు ?
- డాక్టర్ బిధిన్ చంద్ర రాయ్
- డాక్టర్ బీ.కే. మిశ్రా
- డాక్టర్ నాగేశ్వరరావు
- డాక్టర్ గోఖలే
జవాబు: డాక్టర్ బీ.కే. మిశ్రా