తెలంగాణలో అడ్డగోలుగా… !!

తెలంగాణలో రసాయన ఎరువులు అడ్డగోలుగా వాడుతున్నారు. దేశంలో ఎకరాకు సగటున 51.2 కిలోల ఫర్టిలైజర్స్ వాడుతుంటే… తెలంగాణలో మాత్రం ఎకరానికి 185 కిలోలు వేస్తున్నారు. నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (NPK) వాడకంలో అయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన అధ్యయనంతో ఈ విషయాలు తెలిశాయి. 2016లో రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 24 లక్షల టన్నుల ఎరువు వాడగా.. 2017లో 28.39 లక్షలకు పెరిగింది. ఇది కాస్తా 2019 నాటికి 35 లక్షల టన్నులకు చేరింది. 2020లో ఒక్క ఖరీఫ్ లోనే 23 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. రోజు రోజుకీ ఎరువుల వినియోగిం ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే…

Read More

సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్.. వాళ్లు ఒప్పుకుంటేనే ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల అభివృద్ధి పర్యటనల్లో వరాలు జాలువారుతాయి. జిల్లా మంత్రులు అడిగినవే కాకుండా అడగనివి కూడా మంజూరు చేస్తారు. గతంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనల మాదిరిగానే డిసెంబర్ 10న కేసీఆర్ సిద్ధిపేట పర్యటన సాగింది. తెలంగాణ రాష్ట్రానికి సిద్ధిపేట జిల్లాను బొడ్రాయిగా అభివర్ణించిన సీఎం.. హరీశ్ అడ్డాకి అనేక వరాలు ప్రకటించి వెళ్లారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తా అన్న వాగ్దానం.. చాలా మందిలో సాధ్యమేనా అనే సందేహాలు రేకెత్తించింది. ఎందుకంటే.. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ కే ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లేదు. ఇప్పుడు కొత్తగా సిద్ధిపేట పేరు తెరపైకి వచ్చి చేరింది. మరి వరంగల్, సిద్ధిపేట… ఈ రెండింట్లో దేనికి ముందుగా ఎయిర్ పోర్ట్ వస్తుంది ?? GMR ఒప్పుకుంటేనే .. !! తెలంగాణలో నిర్వహణలో…

Read More

డిసెంబర్ 15 నుంచి RRB పరీక్షలు !!

RRB లో NTPC, గ్రూప్ D, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం రాత పరీక్షలను డిసెంబర్ 15 నుంచి నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. షిఫ్ట్ ల ప్రకారం పరీక్షలు జరుపుతామని తెలిపింది. మినిస్టీరియల్ అండ్ ఐసోలెటెడ్ కేటగిరీల్లో 1,663 పోస్టుల కోసం డిసెంబర్ 15 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. NTPC, గ్రూప్ D పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. కోవిడ్ పరిస్థితుల వల్ల అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్లు పంపించడం జరగదని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రిక్రూట్మెంట్ వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత వెబ్ సైట్ నుంచి తెలుసుకోవాలి. దక్షిణమధ్య రైల్వేలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు http://www.rrbsecunderabad.nic.in/ ద్వారా…

Read More

బల్దియా పోరుకి సై .. డిసెంబర్ 1న పోలింగ్ !!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో బల్దియా పోరు రసవత్తరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పునకు నాందిగా భావిస్తున్న గ్రేటర్ ఫైట్ కు డేట్స్ లాక్ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి నవంబర్ 17న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి వార్డు రిజర్వేషన్ల పునర్వస్థీకరణ లేదని.. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్ పరిధిలోని శాసనసభ స్థానాల్లో ఉన్న ఓటర్ల జాబితాతో నవంబర్ 16 కటాఫ్ తేదీతో తుది ఓటర్లను ప్రకటించామని వెల్లడించారు. గతానికి భిన్నంగా ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ సారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్…

Read More

రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ 20 – 20 !!

తనని ఎర్రమట్టి కోర్టుల రారాజు అని ఎందుకంటారో 34 ఏళ్ల రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించారు. ఆదివారం పారిస్ లోని రొలాండ్ గారోస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ ను చిత్తుచేసిన ప్రపంచ నంబర్ టూ రాఫెల్ నాదల్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని గెలిచాడు. తొలి రెండు సెట్లని సునాయసంగా దక్కించుకున్న స్పెయిన్ దిగ్గజ స్టార్ ( 6 – 0, 6 – 2 ).. హోరాహోరీగా జరిగిన మూడో సెట్లోను పైచేయి సాధించి 7 – 5 తో సెర్బియన్ స్టార్ జకోవిచ్ ని ఓడించాడు. ఈ విజయంతో నాదల్.. పురుషుల గ్రాండ్ స్లామ్ లో 20 టైటిల్స్ సాధించిన రోజరర్ ఫెదరర్ తో సమానంగా నిలిచాడు. నాదల్ కి ఇది…

Read More

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ – 2020 ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ కు 2,73,588 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,32,811 మంది పరీక్షకు హాజరు కాగా.. 2,02,682 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతశాతం 87.05 శాతంగా నమోదైంది. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,56,953 మందిలో 1,33,066 (84.78 శాతం), అగ్రి మెడికల్‌లో 75,858లో 69,616 (91.77 శాతం) క్వాలిఫై అయ్యారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఎంసెట్‌ను సెప్టెంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి ఈసారి రెండోసారి ఎంసెట్‌ నిర్వహించారు. ఫలితాల కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి AP EAMCET – 2020 RESULTS

Read More

సాగర్ సామర్థ్యంలో 110 టీఎంసీలు స్వాహా !!

వానాకాలంలో న్యూస్ పేపర్లో చాలా మంది ఆసక్తితో చూసే కాలమ్… ఏ ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, ఇన్ ఫ్లో ఎంత.. ఔట్ ఫ్లో ఎంత అనే వివరాలు. ఆయా ప్రాజెక్టులు నిండినయ్ అంటే.. అవి మన దగ్గర లేకున్నా.. మనసులో ఏదో తెలియని ఆనందం వస్తుంది. కానీ.. వాస్తవానికి ప్రాజెక్టుల్లో నిజంగా సామర్థ్యానికి తగిన నీటి నిల్వ చేరుతుందా అంటే.. నిస్సందేహంగా లేదనే చెప్పాలి. దశాబ్దాలుగా ప్రాజెక్టుల అడుగన పేరుకుపోతున్న పూడిక… వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తోంది. దాదాపు 408 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు.. నేడు 312 టీఎంసీలకే పరిమితం అయ్యింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోను ఇంతకుమించి పూడిక పేరుకుపోయింది. 53 ఏళ్లలో 110 టీఎంసీలు.. !! నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన…

Read More

నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓటు నమోదు సాధ్యమేనా ??

తెలంగాణలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజవర్గాల ఓటు నమోదు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఏజెంట్లను పెట్టి మరీ పట్టభద్రుల నుంచి సర్టిఫికెట్లు, ఫోటోలు సేకరించి ఫాం – 18 నింపి తహసీల్దార్, మున్సిపల్ ఆఫీసుల్లో సమర్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్నవారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు పొలిటికల్ పార్టీలు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే.. ఓటరు నమోదు ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. టీఆర్ఎస్ నకిలీ సర్టిఫికెట్లతో పట్టభద్రుల ఓట్లు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ.. ఎన్నికల ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శశాంక్ గోయల్ ను కలిసి.. ఓటరు నమోదుపై దృష్టి సారించాలని కోరింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో…

Read More

MLC ఎలక్షన్స్ – లెక్క ఎక్కువైతే కారుకే లక్కు !!

MLC Kodandaram

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. హైదరాబాద్ – మహబూబ్ నగర్ – రంగారెడ్డి స్థానం నుంచి ఎవరు పోటీలో ఉంటారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేకున్నా… వరంగల్ – నల్గొండ – ఖమ్మం సీటు నుంచి బరిలో ఉండేవారెవరనే విషయంలో స్పష్టత వచ్చింది. తెలంగాణ జన సమితి నుంచి ఆచార్య కోదండరామ్ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి డాక్టర్ చెరుకు సుధాకర్.. యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ బరిలో నిలవటం ఖాయమైంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మళ్లీ పోటీలో ఉంటారని సమాచారం. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి ఎవరన్నది తేల్చలేదు. తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్), సుదగాని ఫౌండేషన్ ఛైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నట్లు…

Read More

Daily Current Affairs Quiz – August 9, 2020

Read More