ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాల్లో 2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు 18వ ఆసియా క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో 45 దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలను గెలుచుకొని పతకాల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
– చైనా 132 స్వర్ణాలు, 92 రజతాలు, 65 కాంస్యాలతో కలిపి మొత్తం 280 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో(75 స్వర్ణాలు, 56 రజతాలు, 74 కాంస్యాలు, మొత్తం 205), దక్షిణ కొరియా మూడో స్థానంలో(49 స్వర్ణాలు, 58 రజతాలు, 70 కాంస్యాలు ,మొత్తం 177) నిలిచాయి.
-
ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా జపాన్ స్విమ్మర్ రికాకో ఇకీ ఎంపికైంది. స్విమ్మింగ్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 18 ఏళ్ల ఇకీ ఆరు పసిడి, రెండు రజత పతకాలను సాధించింది.దీంతో 1998 తర్వాత ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఇకీ గుర్తింపు పొందింది.
మాదిరి ప్రశ్నలు
18వ ఆసియా క్రీడలు ఇటీవల కింది వాటిలోని ఏ నగరంలో జరిగాయి ?
జకార్తా
న్యూఢిల్లీ
బీజింగ్
టోక్యో
జవాబు: జకార్తా