సుశాంత్ కి ఏఆర్ రహమాన్ సంగీత నివాళి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ తోపాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ప్రతిభ కలిగిన యువ నటుడు.. బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితులని శోక సంద్రంలో ముంచేసింది. స్నేహితులు, బంధువులు, అభిమానులు వివిధ రూపాల్లో సుశాంత్ కి నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ .. తన బృందంతో కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి వర్చువల్ కన్సర్ట్ ద్వారా సంగీత నివాళి అర్పించారు. సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించిన దిల్ బేచారా చిత్రంలోని పాటలని ఏఆర్ రహమాన్, బాలీవుడ్ టాప్ సింగర్స్ తో కలిసి ఆలపించారు.

టైటిల్ సాంగ్ ని ఏఆర్ రహమాన్.. కూతురు రహీమా రహమాన్, కొడుకు ఏఆర్ అమీన్, మరో సింగర్ హిరాల్ విరాడియాతో కలిసి ఆలపించారు. ప్రముఖ గాయనీ గాయకులు మోహిత్ చౌహాన్, సునిధి చౌహాన్, శ్రేయా గోషల్, హృదయ్ గట్టాని, అర్జిత్ సింగ్, షాషా తిరుపతిలు ఈ వర్చువల్ కన్సర్ట్ లో పాల్గొని సుశాంత్ కి నివాళులర్పించారు. ఇద్దరు క్యాన్సర్ బాధితుల ప్రేమ కథగా తెరకెక్కిన దిల్ బేచారా చిత్రం.. జూలై 24న ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ముఖేశ్ ఛబ్రా దర్శకత్వం వహించగాఏఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments