తెలంగాణను “హైరిస్క్” లో చేర్చిన ఆంధ్రప్రదేశ్ !!

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ – 19 కేసులు రోజు రోజుకీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి వెయ్యికి తక్కువగా కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. సరిహద్దుల మీదుగా రాష్ట్రంలోకి వచ్చే వారికి తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, కర్ణాటకలో పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందంటోన్న ఏపీఆ రాష్ట్రాలను హై రిస్క్ జాబితాలో చేర్చింది. గతంలో రిస్క్ జోన్ లో ఉంచిన ఈ రాష్ట్రాలను.. కేసులు ఎక్కువ అవుతున్నందున హై రిస్క్ లోకి మార్చినట్లు ఏపీ చెబుతోంది. తెలంగాణ, కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చే వారికి తప్పనిసరిగా స్వాబ్ టెస్టులు నిర్వహించి.. రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తారు. నెగటివ్ వస్తే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా

కేసులు – 30,163

యాక్టివ్ కేసులు – 14528

డిశ్చార్జ్ – 15227

మృతులు – 408

నిర్వహించిన పరీక్షలు – 1195766

తెలంగాణలో కరోనా

కేసులు – 36,221

యాక్టివ్ కేసులు – 12,718

డిశ్చార్ – 23,679

మృతులు – 365

నిర్వహించిన పరీక్షలు – 1,81,849

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments