బాబు ధర్మ పోరాట దీక్ష ఖర్చెంతో తెలుసా.. ?

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ టూ ఢిల్లీ రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో ప్రత్యేక హోదా నినాదం ద్వారా మైలేజ్ పొందేందుకు బాబు, జగన్, పవన్ లు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి.. తమ నినాదాన్ని కాస్త గట్టిగా వినిపించే అవకాశం చంద్రబాబు అండ్ కో టీమ్ కి లభించింది. వాళ్ల ప్లాన్ లో భాగంగానే ఫిబ్రవరి 11న చంద్రబాబు అండ్ టీమ్, అయ్యో.. సారీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. కేవలం పార్టీ, నేతలు, ప్రజా ప్రతినిధులు ఉంటే సరిపోదు కదా. అందుకే ఏపీ నుంచి ప్రజల్ని(అంతా టీడీపీ కార్యకర్తలే అన్నది విపక్షాల ఆరోపణ) ఢిల్లీకి తరలించింది. ఇందుకోసం హస్తినలో 3500 హోటల్ రూమ్ లని బుక్ చేసింది. ఏపీ నుంచి ఏకంగా రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. పార్టీ కీలక నేతలను విమానంలో తీసుకొచ్చింది. ఈ మొత్తానికి భారీగానే ఖర్చు చేశారని.. రాజకీయాలు, నేటి ప్రయాణ ఖర్చులపై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది.

ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష కోసం హోటల్ బుకింగ్ కోసం చేసిన ఖర్చుపై ఇండియా టుడే ట్వీట్

ఏపీ నుంచి ప్రత్యేక రైళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. కోటి 12 లక్షలను భారతీయ రైల్వేకు చెల్లించింది. ఇక ఢిల్లీలో హోటల్ రూమ్ ల కోసం దాదాపు రూ. కోటి వరకు అయినట్లు అంచనా. ఢిల్లీలో సభా స్థలి ఏర్పాట్లు, కీలక నేతల ఫ్లైట్ చార్జీలు భారీగానే ఉంటాయి. రైల్వేకు జీవో ద్వారా కోటికిపైగా చెల్లించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇతర ఖర్చులపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం కలిపి.. రూ. 50 నుంచి 70 కోట్ల రూపాయల మధ్య ఖర్చు చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఇతర ఖర్చులకు సంబంధించి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జీవో విడుదల చేస్తుందా ? లేక వాటిని పార్టీ ఖాతా పెట్టినట్లు ప్రకటిస్తుందా ? చూడాలి మరి… !

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments