వారంలో AP DSC – B.Ed. వాళ్లకు SGT అవకాశం !

వికాసం: ఆంధ్రప్రదేశ్ లో వారంలో రోజుల్లో ఉపాధ్యాయుల నియామకాల నోటిఫికేషన్ రానుంది. 9,275 పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో.. జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉంటాయి ? ఎస్జీటీ పోస్టులు ఎన్ని ? సబ్జెక్టుల వారీగా ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ? అనే విషయాలపై స్పష్టత కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2014లో టెట్ కమ్ టీచర్ రిక్రూట్ మెంట్ ద్వారా 9,061 ఖాళీలు భర్తీ చేశారు.

బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం

గతంలో బీఎడ్ అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు కు అర్హత ఉండేది కాదు. అయితే.. ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల్లో సవరణలు చేసి.. బీఎడ్ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అర్హులే అని తేల్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం జారీ చేసిఅన్ని రాష్ట్రాలకు పంపింది. దీంతోఇకపై జారీ చేసే ఏ ఉపాధ్యాయ నియమాకాల్లో అయినా ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం కలిగింది. అయితేఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఎస్జీటీ కి అర్హత పొందాలంటే.. టెట్ పేపర్ – 1లో అర్హత సాధించి ఉండాలి. అందుకేఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఎస్జీటీకి పోటీ పడే బీఎడ్ అభ్యర్థుల కోసం టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాలని చూస్తోంది. ఇతర పోస్టులకు టీఆర్టీ నిర్వహించనుంది.

  • ఏపీ డీఎస్సీకి 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోస్టుల భర్తీ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

☛  For Current Affairs, Online Practice Tests Visit

☛  https://vikaasam.com

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments