తెలంగాణలో అడ్డగోలుగా… !!

తెలంగాణలో రసాయన ఎరువులు అడ్డగోలుగా వాడుతున్నారు. దేశంలో ఎకరాకు సగటున 51.2 కిలోల ఫర్టిలైజర్స్ వాడుతుంటేతెలంగాణలో మాత్రం ఎకరానికి 185 కిలోలు వేస్తున్నారు. నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (NPK) వాడకంలో అయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన అధ్యయనంతో ఈ విషయాలు తెలిశాయి. 2016లో రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 24 లక్షల టన్నుల ఎరువు వాడగా.. 2017లో 28.39 లక్షలకు పెరిగింది. ఇది కాస్తా 2019 నాటికి 35 లక్షల టన్నులకు చేరింది. 2020లో ఒక్క ఖరీఫ్ లోనే 23 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రానికి వచ్చాయి.ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. రోజు రోజుకీ ఎరువుల వినియోగిం ఈ స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే విషయమే. పంటల సాగులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు ఎంత వాడితే ప్రజల ఆరోగ్యానికి అంత ప్రమాదం అని ఓ వైపు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నాఎరువుల వాడకం తగ్గడం లేదు. ఈ అంశంలో రైతులను తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. రసాయన ఎరువులు వాడితేనే పంట బాగా వస్తుందన్న భావనలోకి రైతులు వెళ్లారు. గ్రామీణ స్థాయిలో రైతులకు సరైన దిశలో దిశానిర్దేశం చేసే వారు లేకపోవటం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గ్రామాల్లో పొలాలను నేలల వారీగా విభజించి.. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు నిర్వహిస్తే.. ఏ నేలల్లో పోషకాలు తక్కువ ఉన్నాయో తేలుతుంది. ఈ నివేదికల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఏ పొలంలో ఎంత ఎరువు వాడాలో సూచిస్తే .. రైతు అంతే వేస్తాడు. ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తక్కువ అవుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గి.. నేల సారం మెరుగవుతుంది. కానీ.. క్షేత్రస్థాయిలో ఎంత మంది వ్యవసాయ అధికారులు నిత్యం రైతులకి అందుబాటులో ఉంటున్నారు ?? ఎంత మంది అధికారులు పంటల సాగులో కర్షకులకి సూచనలు, సలహాలు ఇస్తున్నారు ??

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments