Daily Current Affairs Quiz – August 6, 2020

Read More

కరెంట్ అఫైర్స్ – ఆగస్టు 6, 2020

☛ ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ఉత్తరప్రదేశ్ లోని ఆయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన ఆగస్టు 5న మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చీఫ్‌ సంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం..…

Read More