ఎడారి మిడతలు అంటే ఏమిటి ? వాటిని ఎలా నిలువరించాలి ?

ఎడారి మిడతలు (Desert Locust) అంటే ఏమిటి ? వ్యవసాయ, పశు సంపదకు ఇవి ఏ మేర నష్టం కలిగిస్తాయి ? మన దేశంలో ఇంతకముందు ఎప్పుడైనా వచ్చాయా ? ఈ మిడతల జన్మస్థానం ఎక్కడ ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎడారి మిడతల జీవన క్రమం ఎంత ? నివారణ మార్గాలు ఏవి ? ఈ వివరాలను రైతు శ్రీనివాస మూర్తి గారు సవివరంగా ఈ వీడియోలు వివరించారు. వ్యవసాయంపై ఆసక్తితో విస్తృత అధ్యయనాలు జరిపి.. విలువైన జ్ఞానాన్ని ఆర్జించిన ఆయన.. ఆ సమాచారాన్ని రైతులకు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నారు.  

Read More

తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెటింగ్

షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే సన్నబియ్యం రకం తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కు జాతీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బియ్యం రకానికి మరింత ప్రాచుర్యం కల్పించి మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB)తో చేతులు కలిపింది. ఈ మేరకు జూలై 28న ప్రభుత్వం, వ్యవసాయ యూనివర్సిటీ, ఐఎస్బీ మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ సోనాను 2015లో జయశంకర్‌ వ్యవసాయవర్సిటీ రూపొందించింది. ఈ బియ్యంలో గ్లూకోజ్‌శాతం (గ్రైసిమిక్స్) తక్కువగా ఉన్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) తేల్చింది. దీంతోపాటు అంతర్జాతీయ జర్నల్స్‌లో రీసర్చ్ రిజల్స్ట్ ను ప్రచురించింది. విటమిన్‌-B3 కూడా పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది. ఇతర రకాల సాగుతో పోల్చితే తెలంగాణ సోనా తక్కువ సమయంలో పంటకొస్తుంది. వానకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ సాగుకు…

Read More

కరెంట్ అఫైర్స్ – జూలై 29, 2020

☛ ప్రపంచంలో 75 శాతం పులులు భారత్ లోనే జూలై 29న గ్లోబల్‌ టైగర్‌ డే సందర్భాన్ని పురస్కరించుకొని 2018లో చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం జూలై 28న ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్‌ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు. 2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉన్నాయి. 1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్‌ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుందని… దేశంలో ఉన్న అన్ని టైగర్‌ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ…

Read More