కశ్మీర్ కల్లోలం.. ! కారణం, కారకులెవరు ? వికాసం విశ్లేషణ

జమ్ము కశ్మీర్.. ! భారత్ లో ప్రకృతి అందాల పరంగా భూతల స్వర్గం. శాంతి, భద్రత పరంగా చూస్తే మాత్రం నిత్యం రగులుతున్న కాష్టం. పాకిస్తాన్ సైన్యం ఓ వైపు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు మరోవైపు బరితెగించి జమ్ము కశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. 1947లో మొదలైన ఈ విధ్వంసం… నేటికీ కొనసాగతోంది. కశ్మీర్ ప్రజలను నిత్యం అశాంతిలో, ఆందోళనలో, ఆవేదనలో బతుకులీడ్చేలా చేస్తోంది. ఈ మారణకాండలో వేలాది సైనికులు, సామాన్యులు సమిధలయ్యారు. భారత సైన్యం కంటిమీద కునుకులేకుండా జల్లెడపడుతూ తీవ్రవాదులను ఏరివేస్తున్నా… సరిహద్దులో గుంట నక్కలా కాచుకోని కూర్చున్న పాకిస్తాన్ కశ్మీర్ లో యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తు భారత్ పైకి ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI తోడ్పాటుతో జై షే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరుడుగట్టిన…

Read More

పవన్ కోసం పార్టీల పాకులాట ! “కాపు” కాసేది ఎవరో ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం పూర్తిగా ఆవరించింది. ఏ నోట విన్నా.. జగన్ – పవన్ – బాబు. ఈ ముగ్గురు పేర్లు, వీరిలో ఎవరు ఎవరితో కలుస్తారు.. ఎవరిని ఎవరు దూరం పెడతారు అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా పోటీ పడుతుంటే.. జనసేన మాత్రం ప్రత్యామ్నాయం మేమే అంటూ దూసుకొస్తోంది. ఈ నెల చివరన, లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో.. పార్టీలు, బడా నేతలు సభలు, సమావేశాల హోరు పెంచారు. ముఖ్యంగా… అధికార, విపక్షాలు బల నిరూపణ కోసం బీసీ సభల పేరిట భారీ జనసందోహాన్ని సమీకరించి బలాబలాలను ప్రదర్శించుకున్నాయి. రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధికం కావడంతో వారిపై వరాల వర్షం కురిపించిన రెండు పార్టీలు మరో బలమైన సామాజికవర్గం ఓట్ల కోసం కాపు…

Read More

జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య….. !!!!

భూతల స్వర్గం లాంటి కశ్మీరం ఉగ్రవాద భూత పిశాచ గణాల పద ఘట్టనల్లో ప్రత్యక్ష నరకంగా మారింది. లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటు వాద శక్తులు, వారికి తోడుగా ఉగ్రమూకలు సృష్టిస్తోన్న మారణకాండకు కశ్మీరం కుమిలిపోతోంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఇలాంటి ఘటనలతో మంచు ప్రాంతంలో రక్తపుటేరులు పారిస్తున్న ఉగ్రవాదులు… స్థానికంగా ఉన్న యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. వారిని భారత సైన్యంపైకి ఉసిగొల్పుతున్నారు. కశ్మీర్ లోయలో తీవ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం అపరేషన్లు నిర్వహిస్తూనే ఉంది. అయినా.. జమ్ము కశ్మీర్ లో తీవ్రవాదుల సంఖ్య ఇంకా ఆందోళన కలిగించే స్థాయిలోనే ఉంది. జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం ఈ ప్రాంతంలో 327 మంది తీవ్రవాదులు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు…

Read More

కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ బాహుబలి పరిస్థితేంటి..?

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు తన్నీరు హరీశ్‌రావు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ తనదైన వ్యక్తిత్వ ప్రదర్శనతో తెలంగాణ ప్రజల్లో గులాబీ గూడు కట్టుకునేలా చేసిన ఘనత కచ్చితంగా హరీశ్‌రావుదే. ఆయనో అజాత శత్రువు. ఇతర పార్టీలు సైతం హరీశ్‌రావును రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా విమర్శలు చేసేందుకు సిద్ధపడవు. అది ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణ ఉద్యమాన్ని జనంలో నిత్యం నానేలా చేయడంలో కేసీఆర్‌కు రాజకీయంగా తోడు–నీడగా నిలిచిన హరీశ్‌రావుకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గిపోతోందనేది తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న చిన్న కుర్రాడ్ని అడిగినా తడుముకోకుండా చెప్పగలరు. హరీశ్‌రావును ఫేడవుట్‌ చేయాలన్న ప్రయత్నం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. కేసీఆర్‌ తానుండగానే కొడుకు కేటీఆర్‌కు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా చక్కదిద్దే ప్రయత్నంలోనే ఈ కార్యచరణకు దిగినట్లు హరీశ్‌ అభిమానులు…

Read More

ఖమ్మం లోక్ సభ సీటుపై కాంగ్రెస్ వృద్ధ నేతల నజర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాతో కాంగ్రెస్ కాకలు తీరిన నేతలందరూ కొట్టుకుపోయారు. గులాబీ దళాధిపతి వేసిన పద్మవ్యూహంలో ఇరుక్కున్న చేయి నలిగిపోయింది. శాసనసభ ఎన్నికల్లో చతికిలపడ్డ హస్తం నేతలు…. సార్వత్రిక ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సీనియర్ నేతలు సైతం మట్టికరవడంతో మోహం చూపించుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిన మోహాలు తక్కువే. కేవలం రిజర్వ్ డ్ స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని చూపింది. మిగతా స్థానాల్లో అత్తెసరు మెజారిటీతో గట్టెక్కింది. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపు హస్తం పార్టీకి అభయహస్తంలా నిలిచిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా పూర్వ ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడంతో… సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ వృద్ధనేతల కన్నుపడింది. అక్కడైతే సులువుగా…

Read More

ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు టీడీపీకి లాభమా నష్టమా… ?

మొన్న మేడా మల్లికార్జున రెడ్డి, నిన్న ఆమంచి కృష్ణమోహన్, నేడు అవంతి శ్రీనివాస్… ఇలా అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్నికల వేళ జంప్ జిలానీల సంఖ్య పెరగడం సహజమైనా వరసబెట్టి అధికార పార్టీ నుంచి విపక్షానికి నేతలు వరస కడుతుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా 23 మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీని వీడి సైకిల్ సవారీ చేయగా… ఇప్పుడు టీడీపీ నుంచి ఫ్యాన్ కిందకు చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ఎంపీ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోగా… ఈ లిస్టు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు స్పష్టంచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంటా గ్యాంగ్ గా ఎదిగిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఆయన…

Read More

అవంతి – గంటా. విశాఖలో ఎవరిది పై చేయి ?

విశాఖ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. ఏపీ రాజకీయాల్లోనే గంటా అన్నా… ఆయన గ్యాంగ్ అన్నా… పార్టీలు వెల్ కమ్ బోర్డులతో పచ్చజెండా ఊపేస్తుంటాయి. రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో గంటా శ్రీనివాసరావు… తన సామర్థ్యాన్ని గుర్తుంచుకొని జిల్లాపై పూర్తి పట్టుసాధించే క్రమంలో అనుచరగణాన్ని పెంచుకున్నారు. తాను ఎటువెళ్తే అటు వచ్చే పరివారాన్ని తయారు చేసుకున్నారు. వారిలో ప్రథముడు అవంతి శ్రీనివాస్. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన అనుచరుడిగా ఎదిగిన అవంతి… తదుపరి ప్రజారాజ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ మళ్లీ తిరిగి టీడీపీలో గంటా వెంటే నిలిచారు. కానీ ఏం లాభం మర్రి చెట్టు నీడలో మరో మొక్క ఎదగదన్నట్లు అయింది అవంతి పరిస్థితి. ఇది గుర్తించిన అవంతి శ్రీనివాస్ ఇక గంటా స్నేహానికి ఆఖరి గంట మోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ…

Read More

పవన్ మౌనం.. ఏంటో వ్యూహం.. !

ప్రశ్నించేందుకే అంటు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. జనసేనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వంటి విషయాల్లో ఆలోచింపజేసే విధానాలతో ఆకట్టుకున్నారు. కానీ.. సినిమాల్లో లాగే.. రాజకీయాల్లోను ఆయనలో కంటిన్యుటీ లోపించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగే పలు సంఘటనలు ఇటీవల జరిగినా.. పవన్ మాత్రం వాటిపై కనీసం తమ పార్టీ విధానం ఏంటన్నది క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలో పేరున్న లీడర్, ప్రజల దృష్టిని గ్రాబ్ చేయగల నాయకుడు ఆయన ఒక్కరే కాబట్టి… రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై జనసేన స్టాండ్ ని సహజంగా ఆయన నోటి నుంచే వినాలని అంతా అనుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా అంశాలపై మౌనమే సమాధానమనే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.…

Read More

బాబు ధర్మ పోరాట దీక్ష ఖర్చెంతో తెలుసా.. ?

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ టూ ఢిల్లీ రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో ప్రత్యేక హోదా నినాదం ద్వారా మైలేజ్ పొందేందుకు బాబు, జగన్, పవన్ లు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి.. తమ నినాదాన్ని కాస్త గట్టిగా వినిపించే అవకాశం చంద్రబాబు అండ్ కో టీమ్ కి లభించింది. వాళ్ల ప్లాన్ లో భాగంగానే ఫిబ్రవరి 11న చంద్రబాబు అండ్ టీమ్, అయ్యో.. సారీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. కేవలం పార్టీ, నేతలు, ప్రజా ప్రతినిధులు ఉంటే సరిపోదు కదా. అందుకే ఏపీ నుంచి ప్రజల్ని(అంతా టీడీపీ కార్యకర్తలే అన్నది విపక్షాల…

Read More

వైసీపీతో కలిసిపనిచేస్తాం, తప్పేం లేదు : చంద్రబాబు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఇప్పటికే అనేక సార్లు రుజువైన ఫార్ములా. అవసరం.. ఏ రాజకీయ పార్టీనైనా ఏ పార్టీతో అయినా కలిసేలా చేస్తుంది. బిహార్ లో నితీశ్ – లాలూ, తెలంగాణలో టీడీపీ – కాంగ్రెస్ ఇందుకు మంచి ఉదాహరణ. అయితే ఇంతకు మించిన కలయికకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారులు తెరిచారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఒక రోజు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన బాబు.. జగన్ తో కలిసిపనిచేస్తే తప్పేం లేదని మాట్లాడుతూ.. తనదైన శైలిని మరోసారి ప్రదర్శించాడు. బాబు ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదో చెప్పండంటు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ప్రస్తుత సమయంలో…బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. “ఏపీలో జగన్ పార్టీ ఒకటో రెండో సీట్లు గెలిస్తే..…

Read More