☛ పాక్ లో పురాతన హిందూ దేవాలయానికి అరుదైన గుర్తింపు పాకిస్తాన్ లోని పెశావర్ లో ఉన్న పంచ్ తీర్థ్ దేవస్థానాన్ని చారిత్రక జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ లోని కైబర్ పక్ తున్క్వా ప్రావిన్స్ ప్రభుత్వం ఈ మేరకు దేవాలయాన్ని చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. కేపీ ఆంక్విటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దేవాలయం వద్ద 5 చిన్నపాటి సరస్సలు ఉన్నాయి. అందుకే పంచ్ తీర్థ్ అనే పేరు వచ్చింది. మహాభారతం ప్రకారం పాండు రాజు ఈ ప్రాంతానికి చెందిన వారు. కార్తీక మాసంలో ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు అనేక మంది భక్తులు వచ్చే వారట. ☛ తెలంగాణ నీటిపారుదల శాఖకు CBIP అవార్డు తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్…
Read MoreMonth: January 2019
Daily Current Affairs, January 02 – 04, 2019
☛ అనిన్దింతా నియోగి అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు కటక్ కు చెందిన ప్రముఖ నృత్య కారిణి అనిన్దింతా నియోగ్ అనామ్ కు జాతీయ నృత్య శిరోమణి అవార్డు దక్కింది. జనవరి 3న జరిగిన 10వ కటక్ మహోత్సవ్ లో భాగంగా… ఆమెకు ఈ అవార్డుని ప్రదానం చేశారు. కటక్ మహోత్సవ్ అనేది అంతర్జాతీయ నృత్య, సంగీత ఉత్సవం. కటక్ నృత్య అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను అనిన్దింతా కు ఈ అవార్డు ఇచ్చారు. ☛ Green Ag కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం వ్యవసాయం విధానంలో మార్పుల ద్వారా పర్యావరణం, జీవావరణ అభివృద్ధి, అటవీ రక్షణ వంటి లక్ష్యాలను సాధించడం కోసం భారత ప్రభుత్వం గ్రీన్ ఆగ్ (Green Ag) అనే కార్యక్రమాన్ని జనవరి 2న ప్రారంభించింది. గ్లోబల్ ఎన్విరాన్ మెంట్ ఫెసిలిటీ (GEF)…
Read MoreDaily Current Affairs – January 01, 2019
☛ స్మృతి మందనకు ఐసీసీ అవార్డ్ – 2018 భారత మహిళా క్రికెటర్ స్మృతి మందనకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2018 సంవత్సరానికిగాను “ఉత్తమ మహిళా క్రికెటర్”, “వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్” అవార్డులు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ డిసెంబర్ 31న ఐసీసీ అవార్డులు ప్రకటించారు. భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి (2007)లో ‘ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’దక్కించుకుంది. దీంతో ఈ అవార్డు గెలుచుకున్న రెండో భారత మహిళా క్రికెటర్గా 22 ఏళ్ల స్మృతి రికార్డులకెక్కింది. 2018లో స్మృతి 12 వన్డేల్లో 669 పరుగులు (సగటు 66.90), 25 టి20ల్లో 622 పరుగులు (స్ట్రయిక్ రేట్ 130.67) చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్, వికెట్ కీపర్ అలీసా హీలీకి ‘ఐసీసీ టి20 మహిళా క్రికెటర్’…
Read More