ఢిల్లీ ఎల్జీకి సర్వ అధికారాలు లేవని సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం జూలై 4న తీర్పు వెలువరించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సలహాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా లేదని, జాతీయ రాజధాని అయిన ఢిల్లీ ప్రత్యేకమైనది, భిన్నమైనది కాబట్టి ఎల్జీ హోదా రాష్ట్ర గర్నవర్ హోదాతో సమానమైనది కాదని పేర్కొంది. ఆయన ఒక పాలనాధికారి మాత్రమే అని తెలిపింది. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ మధ్య తలెత్తిన వివాదంపై జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఢిల్లీ అధికారాలు, హోదాకు సంబంధించిన ఆర్టికల్ 239AA తో ముడిపడి ఉన్న అనేక విషయాలపై తీర్పు వెలువరించింది. శాంతి భద్రతలు, పోలీస్, భూములు మినహా మిగతా అన్ని అంశాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ శాసన సభకు…

Read More

భారత మహిళల క్రికెట్ టీమ్ కోచ్ గా రమేశ్ పవార్

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ నియమితులయ్యారు. ఆగస్టు 14న బీసీసీఐ ఈ మేరకు ప్రకటించింది. 2018 నవంబర్ లో డిసెంబర్ లో జరగనున్న ట్వంటీ20 ప్రపంచ కప్ వరకు పవార్ కోచ్ గా కొనసాగుతారు. ఇంతకముందు భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఉన్న తుషార్ అరోథే పై మహిళా క్రికెటర్ల ఫిర్యాదు కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో 2018 జూలైలో పవార్ ను తాత్కాలిక కోచ్ గా ఎంపిక చేసిన బీసీసీఐ… తాజాగా పూర్తి స్థాయి ప్రధాన కోచ్ గా నియమించింది.

Read More

ఛత్తీస్ గఢ్ గవర్నర్ బల్ రాంజీ దాస్ టండన్ కన్నుమూత

జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ దాస్ టాండన (90) గుండెపోటు కారణంగా రాయ్‌పూర్‌లో ఆగస్టు 14న కన్నుమూశారు. 1927 నవంబర్ 1న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన టాండన్… 1951వ స్థాపించిన జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1951-1957 మధ్య కాలంలో టండన్ పంజాబ్ జన్‌సంఘ్ కార్యదర్శిగా ఉన్నారు. 1995-97 మధ్య పంజాబ్ విభాగం బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1960లో మొదటిసారిగా అమృత్‌సర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం అమృత్‌సర్ నుంచి ఐదుసార్లు, రాజ్‌పురా నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే పంజాబ్ డిప్యూటీ సీఎంగా, కేబినేట్ మంత్రిగా ఆయన పనిచేశారు. ఎమర్జెన్సీకాలంలో 1975-77 వరకు 19 నెలల పాటు జైలులో ఉన్నారు. టాండన్ భార్య బ్రిజ్‌పాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Read More

సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆగస్టు 13న సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018ని విడుదల చేసింది. 111 నగరాలతో కూడిన ర్యాంకింగ్స్ లో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పుణే మొదటి స్థానంలో నిలిచింది. నవీ ముంబై 2వ స్థానంలో, గ్రేట‌ర్ ముంబై 3వ స్థానంలో, తిరుపతి 4వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో హైదరాబాద్ 27, బెంగళూరు 58వ స్థానంలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ నగరం చివరి స్థానంలో నిలిచింది.

Read More

అత్యంత నివాసయోగ్యమైన నగరంగా వియన్నా

ప్రముఖ పత్రిక ది ఎకనమిస్ట్ ఆగస్టు 14న విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాసయోగ్య సూచి – 2018లో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 140 నగరాల జాబితాతో విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత్ రాజధాని ఢిల్లీ 112వ స్థానంలో, ముంబయి 117వ స్థానంలో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో మెల్ బోర్న్, మూడో స్థానంలో ఒసాకా, నాలుగో స్థానంలో కాల్ గిరి నిలిచాయి. సిరియా రాజధాని డమాస్కస్ కు చివరి స్థానం దక్కింది. స్థిరత్వం, ఆరోగ్యం, నాగరికత-పర్యావరణం, విద్య, మౌలికవసతులు ప్రామణికంగా ది ఎకనమిస్ట్ ఈ ర్యాంకింగ్స్ కేటాయించింది.

Read More

తెలంగాణ సభాపతికి హైకోర్టు నోటీసులు

తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆగస్టు 14న తాఖీదులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల పునరుద్ధరణకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు పాటించని కారణంగా ఈ మేరకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యులను బహిష్కరిస్తు ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ను డీనోటిఫై చేయడానికి అనుమతించకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమేనని పేర్కొంది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో ఓ సభాపతికి నోటీసులు జారీ కావడం ఉమ్మడి హైకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. కోటమిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) – నల్గొండ నియోజకవర్గం సంపత్ కుమార్       (కాంగ్రెస్ ఎమ్మెల్యే)-  అలంపూర్ నియోజకవర్గం

Read More

2018 (జనవరి – జూన్) అంతర్జాతీయం

జకార్తాలో ఆసియాన్-ఇండియా నెట్ వర్క్ సమావేశం ఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదో రౌండ్ టేబుల్ సమావేశం జకార్తాలో జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆమె ఆకాంక్షించారు. నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు. సింగపూర్ లో ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ 2018 సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్ -ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారని కొనియాడారు.

Read More