2018 (జనవరి – జూన్) అంతర్జాతీయం

జకార్తాలో ఆసియాన్-ఇండియా నెట్ వర్క్ సమావేశం

ఆసియాన్-ఇండియా నెట్‌వర్క్ మేధావుల ఐదో రౌండ్ టేబుల్ సమావేశం జకార్తాలో జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జనవరి 6న ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ‘సమష్టి భద్రత, సమష్టి సంపద’ సూత్రాల ఆధారంగా ఆసియాన్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ఆమె ఆకాంక్షించారు. నౌకాయాన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వ సంబంధాలను పెంపొందించుకోవాలన్నారు.

సింగపూర్ లో ఆసియాన్-ప్రవాసీ భారతీయ దివస్ 2018

సింగపూర్‌లో జనవరి 7న జరిగిన ఆసియాన్ -ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. సదస్సులో ప్రసంగించిన ఆమె.. ఆసియాన్ కూటమితో భారత్ దృఢ బంధం ఏర్పరచుకోవడంలో ప్రవాస భారతీయులు అద్భుత వేదికగా నిలిచారని కొనియాడారు.

Related posts

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments