భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ నియమితులయ్యారు. ఆగస్టు 14న బీసీసీఐ ఈ మేరకు ప్రకటించింది. 2018 నవంబర్ లో డిసెంబర్ లో జరగనున్న ట్వంటీ20 ప్రపంచ కప్ వరకు పవార్ కోచ్ గా కొనసాగుతారు.
ఇంతకముందు భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఉన్న తుషార్ అరోథే పై మహిళా క్రికెటర్ల ఫిర్యాదు కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో 2018 జూలైలో పవార్ ను తాత్కాలిక కోచ్ గా ఎంపిక చేసిన బీసీసీఐ… తాజాగా పూర్తి స్థాయి ప్రధాన కోచ్ గా నియమించింది.