Hyderabad : హైదరాబాద్ నగరం నలుమూలలా మెట్రో పరుగులు
రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే మెట్రో రైళ్లతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఒక్క క్షణం తీరిక లేకుండా, మెట్రో రైళ్లు నిరంతరం సిటీలో నడుస్తూనే ఉంటాయి. విద్యార్థులు, పలు ప్రైవేట్ ఉద్యోగాల వారికి మెట్రో రైలు సదుపాయం వరమని చెప్పుకోవచ్చు. అటువంటి మెట్రో వ్యవస్థను సిటీలో మరింత విస్తృత పరిచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మున్ముందు నగరంలోని అన్ని మూలలకు విస్తరించనుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్ కు కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.ఇక మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో.. నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ నుండి శంషాబాద్, రాయదుర్గం నుండి కోకాపేట్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుండి పటాన్ చెరువు, ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ ఇలా మొత్తము 76.4 కిలోమీటర్ల మేరకు మెట్రో రవాణా వ్యవస్థను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి డీపీఆర్ ను కేంద్రానికి పంపించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు.
Leave A Comment